
మరికొన్ని గంటల్లో ఆసియా కప్ లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. అందుకోసం రెండు జట్లు ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఇండియా పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో.. ఆసియా కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ లపై హై ఇంట్రెస్ట్ నెలకొంది. ఉగ్రవాదంపై పాక్ వైఖరికి నిరసనగా ఇండియా టీమ్ ఈ టోర్నీలో చాలా అగ్రెస్సివ్ గా వ్యవహరిస్తోంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కనీసం పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి టీమిండియా ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూపై చర్చ జరుగుతోంది.
ఫైనల్ మ్యాచ్ కు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాక్ మంత్రి మొహ్సీన్ నఖ్వీ హాజరవనున్నారు. మ్యాచ్ అనంతరం ఆయనే ట్రోఫీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాక్ క్రికెట్ బోర్డుకు కూడా ఆయనే హెడ్. అయితే మ్యాచ్ కు నఖ్వీ రావడం సాధారణవిషయమే. కానీ ఏసీసీ ఛైర్మన్ హోదాలో ట్రోఫీ ప్రజెంట్ చేయడంపైనే చర్చంతా.
ఛైర్మన్ గా ట్రోఫీ ఇవ్వడం మ్యాండేటరీ. దానికి తోడు ఇరు జట్ల సభ్యులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ప్లేయర్లతో నో షేక్ హ్యండ్ పాలసీ మెయింటైన్ చేస్తున్న టీమిండియా.. పీసీబీ చీఫ్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేదే సస్పెన్స్. అయితే ఈ విషయంపై బీసీసీఐ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.
అయితే సెప్టెంబర్ 14 మ్యాచ్ తర్వాత మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ ను కొనసాగిస్తే మ్యాచ్ అవాయిడ్ చేస్తామని పీసీబీ హెచ్చరించింది. కానీ ఐసీసీ ఒప్పుకోకపోవడంతో తప్పక ఆడాల్సి వ చ్చింది. మరో విషయం.. సూర్యకుమార్ యాదవ్ ను ఫైనల్ మ్యాచ్ నుంచి నిషేధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం.. పాక్ పై గెలిచిన తర్వాత గెలుపును పహల్గాం బాధితులకు, సెక్యూరిటీ ఫోర్సెస్ కు అంకితం చేస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించడంతో.. సూర్యను ఫైనల్ నుంచి తప్పించాలని పీసీబీ హెడ్ స్థానంలో డిమాండ్ చేశాడు. దీంతో ఇప్పటికే నో షేక్ హ్యండ్ పాలసీ పాటిస్తున్న ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.