అమ్మా.. భయమైతుంది.. రష్యా సైనికుడి లాస్ట్ మెసేజ్

అమ్మా.. భయమైతుంది.. రష్యా సైనికుడి లాస్ట్ మెసేజ్

న్యూయార్క్: ‘‘ఉక్రెయిన్​లో పరిస్థితి ఏం బాగాలేదు. ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు భయంగా ఉంది. ఇక్కడ అన్ని సిటీలపై మేము బాంబులు వేస్తున్నాం. సాధారణ ప్రజలను కూడా టార్గెట్ చేయాల్సివస్తోంది. ఉక్రెయిన్ ప్రజలు వెల్​కమ్​ చెప్తారని అధికారులు మాకు చెప్పారు. కానీ ఇక్కడి జనాలు మా యుద్ధ ట్యాంకుల కింద పడి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మమ్మల్ని ఫాసిస్ట్​లు అని అంటున్నారు”..  ఉక్రెయిన్​లో చనిపోయే ముందు రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చివరి మెసేజ్ ఇది. ఈ మెసేజ్​ను ఉక్రెయిన్ అంబాసిడర్ సెర్గీ కిస్లిత్సా మంగళవారం జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్​లో చదివి వినిపించారు. రష్యా సైనికుడు తన తల్లితో చేసిన చాటింగ్ ఇది, ఆ తర్వాత కొద్ది సేపటికే ఉక్రెయిన్ దళాల కాల్పుల్లో ఆ సైనికుడు చనిపోయాడు అని సెర్గీ తెలిపారు. దీనిని బట్టి ఉక్రెయిన్​లో రష్యన్ సైనికుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. పుతిన్ నిర్ణయం వల్ల  ఎంతో మంది రష్యా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా ఈ దాడులను ఆపాలని సెర్గీ కోరారు.