రాజ్యసభలో గందరగోళం

రాజ్యసభలో గందరగోళం

న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో డిప్యూటీ చైర్మన్​ హరివంశ్ చైర్​లో ఉన్నారు. మంత్రులు సమాధానాలు ఇచ్చే టైమ్​లో ‘ఏవియేషన్​ సెక్టార్’పై సభ్యులు అడిగిన 18వ ప్రశ్నను స్కిప్ చేశారు. 17వ ప్రశ్న తర్వాత డైరెక్ట్​గా పోలవరంపై ప్రాజెక్టుపై అడిగిన 19 ప్రశ్నను ప్రస్తావించారు.

దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. 18వ ప్రశ్నను స్కిప్​చేయడానికి కారణాలేంటని ఎస్పీ ఎంపీ జయాబచ్చన్, కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర సింగ్ హుడా ప్రశ్నించారు. అది అనుకోకుండా జరిగిందని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. ఈ సమాధానంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు కన్వీన్స్ కాలేదు.