
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే కొంతమంది లంచం అడుగుతుంటారు. న్యాయ బద్దంగా చేయాల్సిన పని అయినా సరే..ఎంతో కొంత ముట్ట జెప్పాల్సిందే. ఈ వీడియోను చూస్తే ఇప్పుడు అదే పద్దతి వానరాలు కూడా అవలంభిస్తున్నాయని అనిపిస్తుంది. ఓ వ్యక్తి చేతిలోని ఐ ఫోన్ ను లాక్కెళ్లిన కోతికి లంచంగా ఫ్రూటీ ప్యాకెట్ ఇచ్చి ఫోన్ ను తీసుకున్నాడు.
కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు.. ఓ కోతి చేసిన వింత చేష్టకు ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి ఆ వ్యక్తిని ముప్పు తిప్పలు పెట్టింది... మొబైల్ ఫోన్. అది కూడా మాములు ఫోన్ కాదు.. ఐఫోన్.
కోతులకు కావాల్సిన వస్తువు ఉండదు.. అక్కర్లేనిది ఉండదు. ప్రతీది ఎత్తుకెళ్తాయి. వాటికి కావాల్సిన వాటికోసం జనాల మీదకి దాడులు కూడా చేస్తుంటాయి. వీటి బెడద ఇండియాలో చాలానే చోట్ల ఉంటుంది. ఐఫోన్ ఎత్తుకెళ్లిన ఓ వానరం దానికి లంచంగా ఏమిస్తే ఫోన్ తిరిగిచ్చిందో చూడండి.
మాములుగా అయితే చేతిలో ఏమైనా తినుబండరాలు లాంటివి ఉంటే.. వెంటనే దాన్ని లాక్కుని వెళ్తాయి. అంతేకాకుండా.. చేతుల్లో ఏమీ కనపడ్డా సరే, ఎత్తుకెళ్లడానికే ప్రయత్నిస్తాయి. వాటి కోసం మనుషుల పై దాడి చేసి మరీ ఎత్తుకుని పారిపోతాయి. అయితే ఇక్కడ ఓ కోతి.. ఓ వ్యక్తి ఐఫోన్ తీసుకుని వెళ్లిపోయింది. బృందావనంకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి కోతి ఐఫోన్ ఎత్తుకెళ్లింది. మధుర, బృందావనంలలో కోతుల బెడద ఎక్కువగానే ఉంటుంది. మనుష్యుల నుండి వస్తువులను లాక్కోవడం వాటిని తిరిగి తీసుకునేటప్పుడు ముప్పు తిప్పలు పెట్టిన సంఘటనలు అనేకం చూస్తుంటాం. తాజాగా బృందావనంలో ఓ వ్యక్తి ఐఫోన్ ఎత్తుకెళ్లింది ఓ వానరం. శ్రీరంగనాథ్ జీ మందిరంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండు వానరాలు గోడపై కూర్చున్నాయి. వాటిలో ఒకటి ఐఫోన్ పట్టుకుంది. కింద గుమిగూడిన జనం దానిని నుండి ఫోన్ తిరిగి ఎలా తీసుకోవాలా? అని పరేషాన్ అవుతున్నారు. రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు ఆ వానరంకి ఫ్రూటీ ప్యాకెట్ విసిరారు. అంతే దానిని పట్టుకున్న కోతి చేతిలో ఉన్న ఫోన్‌ని వదిలేసింది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తి ఫోన్‌ను క్యాచ్ పట్టుకున్నాడు. ‘బృందావనంలో కోతులు’ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదే వస్తు మార్పిడి విధానం’ అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.