వర్షాకాలం రోగాలకు.. ఇంట్లోని చిట్కా వైద్యం ఇలా..

వర్షాకాలం రోగాలకు.. ఇంట్లోని చిట్కా వైద్యం ఇలా..

రుతుపవనాలు వచ్చేశాయి. కొన్ని చోట్ల ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల విధ్వంసకర పరిస్థితులను ఏర్పరుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వరదలతో పాటు వచ్చే అనేక శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు, ఇతర వ్యాధులు అనారోగ్యాలను తెచ్చిపెడతాయి. జలుబు, ఫ్లూ నుంచి బ్రోన్కైటిస్, అస్తమా వరకు.. అనేక వ్యాధులు చుట్టుముడతాయి. ఈ కాలంలో ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇది మరింత కష్టంగా ఉంటుంది. కానీ భయపడాల్సిన పనేం లేదు. మీ శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా, ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి చేయాలంటే ఇంట్లో ఉంటూనే నివారించవచ్చు.

పసుపును వాడండి:

శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు అత్యంత పురాతనమైన, అత్యంత విశ్వసనీయమైన ఇంటి నివారణలలో పసుపు ఒకటి. పసుపుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, బ్రోన్కైటిస్, ఉబ్బసం వంటి చికిత్సలకు అద్భుతమైన ఔషధంగా చేస్తుంది. మెరుగైన ఆరోగ్యం కోసం ఒక టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటితో కలిపి రోజుకు రెండుసార్లు త్రాగాలి. అదనపు ప్రయోజనాల కోసం ఈ మిశ్రమానికి అల్లం కూడా జోడించవచ్చు.

తేనె తాగండి :

తేనె సహజమైన క్రిమినాశకి. కాబట్టి ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తేనె నుంచి మరిన్ని ప్రయోజనాల కోసం.. ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదా టీలో ఒక చెంచా తేనె వేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి.

ఆవిరి పట్టండి:

ఆవిరిని పీల్చడం అనేది శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు కూడా సమర్థవంతమైన పరిష్కారం. ఎందుకంటే ఇది కఫం, నాసికా భాగాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇంట్లో ఆవిరిని పీల్చుకోవడానికి, ఒక కుండలో కొంత నీటిని మరిగించి.. ముఖం, తలను నేరుగా కుండపై ఉండేలా వంచండి. ఆవిరిని పట్టేటపుడు తలపై టవల్ లేదా బ్లాంకెట్ ను వేసుకోండి. అలా నోటి ద్వారా 10 నిమిషాలు శ్వాస తీసుకోండి.

హైడ్రేటెడ్‌గా ఉండండి:

వర్షాకాలంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది నాసికా భాగాలను స్పష్టంగా ఉంచుతుంది. దీని వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడడాన్ని సులభతరం చేస్తుంది. ఈ సీజన్ లో నీరు పుష్కలంగా తాగాలి. అలాగే మూలికా టీలు లేదా పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలు కూడా తీసుకోవచ్చు.

కోల్డ్ ఫుడ్స్‌ను నివారించండి:

ఐస్‌క్రీం లేదా ఐస్‌డ్ డ్రింక్స్ వంటి శీతల ఆహారాలు తినడం వల్ల ముక్కు భాగాలలో ఆటంకం ఏర్పడుతుంది, వైరస్‌లు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం కూడా ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. వర్షాకాలంలో చల్లని ఆహారాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. బదులుగా వెచ్చని సూప్‌లు లేదా హెర్బల్ టీలను ఎంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.