
భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం (జూన్ 4న) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అంటే జూన్ 7వ తేదీకి కేరళను తాక వచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది.
వాస్తవానికి వర్షాలు గత కొన్ని రోజులుగా దూబూచులాడుతున్నాయి. అదేసమయంలో నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీ నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు ముందుగా అంచనా వేశారు. కానీ... ఈ అంచనాలు తారుమారయ్యాయి. జూన్ 7వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను చేరుకుంటాయని తెలిపారు. ఆ తర్వాత అక్కడ నుంచి కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించారు.
ముందస్తు అంచనా ప్రకారం.. జూన్ 4వ తేదీనే కేరళలోకి రుతు పవనాలు వస్తాయని ప్రకటించారు. అయితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడిందని.. జూన్ 5వ తేదీ సాయంత్రం భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
మూడు రోజులు ఆలస్యంగా.. అంటే జూన్ 7వ తేదీకి కేరళలోకి రుతు పవనాలు ప్రవేశించొచ్చని అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లను పరిశీలిస్తే.. ఈ ఏడాది రుతు పవనాల రాక మరింత ఆలస్యమైంది. 2000 సంవత్సరంలో జూన్ ఒకటో తేదీనే ఎంటర్ అయ్యాయి. 2021లో జూన్ 3వ తేదీన కేరళను తాకాయి. 2022లో మే 29వ తేదీనే రుతు పవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. 2023లో ముందస్తు అంచనా అయితే జూన్ 4వ తేదీకే రావాల్సి ఉన్నా.. ఇప్పుడు దాన్ని సవరించారు అధికారులు. జూన్ 7వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించారు.