విస్తరించిన రుతుపవనాలు : రాష్ట్రంలో తొలకరి కురిసింది

విస్తరించిన రుతుపవనాలు : రాష్ట్రంలో తొలకరి కురిసింది

నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చల్లని కబురు అందించాయి. రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావంతో గురువారం నాడు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు పడ్డాయి. 24 గంటల్లోనే తెలంగాణలో 70శాతం ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో వర్షపాతం వివరాలను తెలిపారు. ఈ ఉదయం 8 గంటలకల్లా జనగాం, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, సిద్ధిపేట్, జగిత్యాల్, కుమరం భీమ్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, కొత్తగూడెం , ఇతర జిల్లాల్లో వర్షం పడింది. జనగాం జిల్లా జాఫర్ గఢ్ లో అత్యధికంగా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.