అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్​

అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్​

ఆడపిల్లలా ఆ ఏడుపు ఏంటి?  అమ్మాయిలా మాటిమాటికీ అలుగుతావు ఎందుకు?  భయపడతావు ఎందుకు? ఈ మాటలు ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంట్లో వినపడేవే. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. మరి దాంతో పాటు ఈ మాటలు కూడా మారాల్సిందే. ఎందుకంటే, అందరూ అనుకునేంత వీక్​ కాదు అమ్మాయిలు. ఎమోషన్స్​ను​ బ్యాలెన్స్​ చేయడంలో అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరు వాళ్లు. అబ్బాయిలకు కూడా మూడ్​ స్వింగ్స్​ ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్​ మిషిగన్​ స్టడీ కూడా చెబుతోంది.

అమ్మాయిలు, అబ్బాయిల డైలీ ఎమోషన్స్​ మీద యూనివర్సిటీ ఆఫ్​ మిషిగన్​ఒక రీసెర్చ్​ చేసింది. 75 రోజుల పాటు జరిగిన ఈ స్టడీలో మొత్తం 142 మంది అమ్మాయిలు, అబ్బాయిలు పార్టిసిపేట్​ చేశారు. వాళ్లని గ్రూప్​లుగా చేసి పాజిటివ్​ అండ్​ నెగెటివ్ ఎమోషన్స్​ని  స్టడీ చేశారు. డిఫరెంట్​ సిచ్యుయేషన్స్​లో వాళ్ల బిహేవియర్​ని గమనించారు.

రిజెల్ట్​ చూస్తే  అబ్బాయిల్లోనూ మూడ్​ స్వింగ్స్​  కనిపించాయి. రీసెర్చ్​లో భాగంగా వాళ్లకిష్టమైన స్పోర్ట్స్​ లేదా యాక్టివిటీస్​ చూపిస్తుంటే సిచ్యుయేషన్​ బట్టి నిమిషం నిమిషానికి ఎమోషన్స్​ మారాయి వాళ్లల్లో.  పైగా అబ్బాయిలు, అమ్మాయిల ఎమోషన్స్​లో పెద్దగా తేడా కనిపించలేదు. ఒకింత అమ్మాయిలే బ్యాలెన్స్డ్​గా ఉన్నట్టు కనిపించారు అంటున్నారు రీసెర్చర్​లు.