సైక్లింగ్ చేస్తే ఎన్ని లాభాలో..

 సైక్లింగ్ చేస్తే ఎన్ని లాభాలో..

హెల్దీ సైక్లింగ్​ 

సైక్లింగ్​ ఆరోగ్యానికి ఎంతో హెల్ప్​ అవుతుంది. ఎందుకంటే సైక్లింగ్​ మంచి ఎక్సర్​సైజ్  దానికోసం ఎక్కువ కష్టపడనక్కర్లేదు. ఏ ఏజ్​ వాళ్లయినా ఎంజాయ్​ చేస్తూ సైక్లింగ్​ చేయొచ్చు. రోజూ కిరాణా షాప్​కి లేదా చిన్న చిన్న దూరాలకు వెళ్లేటప్పుడు హాయిగా సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లొచ్చు. దాంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకి దాదాపు వందకోట్ల మంది సైక్లింగ్ చేస్తున్నారని ఒక అంచనా.

ఫిట్​నెస్​ కోసం...
కండరాలకు సైక్లింగ్ మంచి వర్కవుట్. 
మిగతా స్పోర్ట్స్​తో పోల్చితే సైక్లింగ్​ చాలా ఈజీ. దీనికి ఫిజికల్​గా ఎక్కువ కష్టం ఉండదు. 
సైక్లింగ్ వల్ల బలంగా తయారవుతారు. స్టామినాతో పాటు ఫిట్​నెస్​ వస్తుంది.
ఫ్రెండ్స్​తో సరదాగా ఎక్కడికైనా సైకిల్​ మీద వెళ్తే ఫన్​తో పాటు హెల్త్​కూ మంచిది.
చిన్న చిన్న దూరాలకు బస్​, బైక్​ వంటివి వాడకుండా సైకిల్​ మీద వెళ్లినా సరిపోతుంది. టైంపాస్​తోపాటు ఎక్సర్​సైజ్​ కూడా అవుతుంది.

ఆరోగ్యానికి...
గుండె ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం చాలా మంచిది. సైక్లింగ్​ కార్డియో వాస్కులార్​ ఫిట్​నెస్​ను పెంచుతుంది.
యాంగ్జైటీ, డిప్రెషన్​ తగ్గిపోతుంది.
సైకిల్​ తొక్కడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా కండరాలకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. 
కీళ్లు స్మూత్​గా కదలడానికి కూడా సైక్లింగ్​ ఉపయోగపడుతుంది.
సైక్లింగ్​ చేస్తే స్ట్రెస్ లెవల్స్​ తగ్గుతాయి. బాడీలో కొవ్వు కరుగుతుంది.
కూర్చునే, నిలుచునే పద్ధతిలో మార్పు వస్తుంది. 
ఎముకలు బలంగా తయారవుతాయి.
రోజూ సైక్లింగ్​ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. 
సైక్లింగ్​ చేయడం వల్ల హార్ట్ ఎటాక్​, క్యాన్సర్, డయాబెటిస్​, ఒబెసిటీ, ఆర్థరైటిస్​ వంటి అనారోగ్యాల ముప్పు తప్పుతుంది. 

హ్యాండ్​ సైక్లింగ్​
హ్యాండ్​ సైకిల్స్​ రికంబెంట్​ ట్రైసైకిల్స్​లానే ఉంటాయి. వీటితో కాళ్లకంటే చేతికే పనెక్కువ. అవసరమైనప్పుడు వెల్కోస్ట్రాప్స్ అనేవి చేతికి పెడల్స్ లాగా ఉపయోగపడతాయి. 
స్పైనల్ ఇంజ్యూరీ అయినవాళ్లు కోలుకోవడానికి హ్యాండ్​ సైక్లింగ్ పనికొస్తుంది. అంతేకాకుండా గుండె సంబంధిత, ఏరోబిక్​ బెనిఫిట్స్​ కూడా ఉన్నాయి.