పోయినేడు కంటే ఈసారి మస్తు వడ్లు

పోయినేడు కంటే ఈసారి మస్తు వడ్లు

పోయినేడు కంటే 33.36 లక్షల టన్నులు అధికం

పత్తి, కంది పంటల దిగుబడీ పెరుగుతది

స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్ అంచనా

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది వానాకాలం సీజన్ లో పంట దిగుబడులు అధికంగా వస్తాయని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. ఈసారి వరి, పత్తి, కంది పంట ఉత్పత్తులు అధికంగా వస్తాయని తెలిపింది. ఈ మేరకు పంటల దిగుబడి అంచనా రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఈ సీజన్ లో మొత్తం కోటి 34లక్షల 87వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని పేర్కొంది. ఇందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా.. కోటి 25లక్షల 46వేల టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేసింది. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పింది. పోయినేడు వానాకాలం సీజన్ తో పోలిస్తే ఈసారి 33.36 లక్షల టన్నుల దిగుబడి పెరగనున్నట్లు తెలిపింది. నిరుడు 91.74 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని పేర్కొంది.

కందులూ బాగానే…

ఈసారి పత్తి దిగుబడి కూడా పెరుగుతుందని స్టాటిస్టికల్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. ఈ సీజన్ లో 60.36 లక్షల ఎకరాల్లో పత్తి సాగవ్వగా, 54.81 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఎస్టిమేట్ చేసింది. నిరుడు ఎకరానికి 7.16 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి 9.20 క్వింటాళ్లు వస్తుందని పేర్కొంది. ఈసారి 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగవ్వగా, 8.44 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని స్టాటిస్టికల్​ డిపార్ట్​మెంట్​ అంచనా వేసింది. పోయినేడుతో పోలిస్తే ఈసారి ఉత్పత్తి భారీగా పెరుగుతుందని చెప్పింది. నిరుడు ఎకరాకు 3.65 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి 8.44 క్వింటాళ్లు వస్తుందని పేర్కొంది.

ఇదీ పంట దిగుబడుల అంచనా..

పంట                దిగుబడి (టన్నుల్లో)

వరి                  1.25 కోట్లు

పత్తి                 54.81 లక్షలు

కంది                8.44 లక్షలు

మక్కలు           4.70 లక్షలు

సోయా             3.42 లక్షలు

జొన్న              53 వేలు

వేరుశనగ         41 వేలు

పెసర               22 వేలు

For More News..

న్యాయం చేయలేని ప్రభుత్వం ఉండి ఎందుకు?

నిమ్స్​లో ఆర్గాన్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ సెంటర్!

రాష్ట్రంలో మరో 1,896 కరోనా కేసులు