ట్రావెల్ సేఫ్టీ యాప్‌‌‌‌లతో మహిళలకు మరింత భద్రత

ట్రావెల్ సేఫ్టీ యాప్‌‌‌‌లతో మహిళలకు మరింత భద్రత

హైదరాబాద్, వెలుగు: అమ్మాయిలు బయటకు వెళ్లి ఇంటికి వచ్చే వరకు వారి తల్లిదండ్రులు కాస్త ఆందోళనతోనే ఉంటారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా  ఏ క్షణం ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. దీంతో అమ్మాయిలు ట్రావెల్ చేసే టైమ్ లో సేఫ్టీ పై మరింతగా ఫోకస్ పెడుతున్నారు. వెళ్తున్న దారి, వెళ్లే ప్రదేశం ఏ టైమ్ లో సేఫ్‌‌‌‌గా ఉంటుందో లాంటి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇందుకోసం పలు యాప్‌‌‌‌లు ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో వచ్చాయి. బయటికెళ్లినప్పుడు కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు టచ్ లో ఉండటంతో పాటు ప్రమాదం జరుగుతుందనే అనుమానం వచ్చినప్పుడు వెంటనే అందుబాటులోని పీఎస్‌‌‌‌లకు, యాప్‌‌‌‌లోని ఏరియా వలంటీర్లకు సమాచారం తెలిపే ఫీచర్లు ఈ యాప్స్ లో ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం విమెన్ సేఫ్టీ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోందని డెవలపర్లు ఉపయోగిస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని డెవలపర్లు చెప్తున్నారు. 

ఏరియాకో వలంటీర్
జాబ్స్, స్టడీస్ కోసం సిటీకి వచ్చే అమ్మాయిలు సిటీలో తాము ఉంటోన్న చోటు నుంచి మరో దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేటు టాన్స్ పోర్టులో వెళ్లేటప్పుడు, రాత్రివేళల్లో కొంత భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటప్పుడు విమెన్ సేఫ్టీ యాప్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎన్నో ఫీచర్లతో ‘షీ సేఫ్’ , ‘లైఫ్ ఆఫ్ ఏ గర్ల్’, ‘గార్డియన్’ లాంటి విమెన్ సేఫ్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌‌‌‌లో లాగిన్ అయ్యాక వారి లొకేషన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌‌‌తో షేర్ చేయడంతో పాటు ఉన్న ప్లేస్​కు సంబంధించి సేఫ్టీ రేటింగ్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరుగుతుందని సందేహం వస్తే వెంటనే సంప్రదించేందుకు ఫోన్ నంబర్లు ఉంటాయి. లైఫ్ ఆఫ్ ఏ గర్ల్ యాప్ వలంటీర్లు ప్రతి ఏరియాకు ఉంటున్నారు. ఏ టైమ్ లో అయినా సహకారం అందిస్తున్నారు. 

హెల్ప్ ఫుల్ గా ఉంది
ఏపీ నుంచి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చా. నాన్న నన్ను హాస్టల్​లో జాయిన్ చేసి వెళ్లారు. సిటీకి కొత్త కావడంతో ఎక్కడైనా వెళ్లాలంటే కొంచెం భయంగా ఉంటోంది. అందుకే హాక్ ఐ, లైఫ్ ఆఫ్ ఏ గర్ల్ యాప్స్ ఇన్‌‌‌‌స్టాల్ చేసుకున్నా. వాటిని ఫాలో అవుతూ ఉంటా. మా ఫ్రెండ్స్ కు లోకేషన్ షేర్ చేస్తుంటా. అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉన్న సేఫ్టీ గురించి కూడా చూసుకోవాలి. ఆ విషయంలో ఇలాంటి యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి.
‌‌‌‌‌‌‌‌- దీప, ఎంప్లాయ్, గచ్చిబౌలి