మహిళలకు మరింత భద్రత: హాక్ఐ యాప్

మహిళలకు మరింత భద్రత: హాక్ఐ యాప్

మహిళల భద్రతకు హైదరాబాద్ పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కల్పించేందుకు హాక్ఐ యాప్ ను తీసుకువచ్చింది పోలీస్ శాఖ . ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా రూపొందించిన ఈ మొబైల్ యాప్ మంచి ఫలితాలు ఇస్తుంది

ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందులో తమ పేరుతో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా 8 రకాల సేవలు పొందే వీలుంటుంది.  మహిళలు, యువతులు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా ఏవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నప్పుడు ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. ఇది కంట్రోల్ రూం కు అనుసంధానమై ఉంటుంది.

మహిళలు క్యాబ్, ప్రైవేట్ వాహనాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ యాప్ లో రిజిస్టర్  చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫోన్ నంబర్లను యాప్ లో నమోదు చేసుకోవాలి. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ అనే బటన్ నొక్కితే దగ్గర్లోని పోలీసులకు సమాచారం వెళ్తుంది. దీంతో పాటు అందులో రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నంబర్లకు ప్రమాద హెచ్చరికలు అందుతాయి. దీంతో ప్రమాద స్థలానికి పోలీసులు తొందరగా చేరుకుని వెంటనే సహాయం చేయడానికి వీలుంటుంది. ఈ హాక్ఐ గచ్చిబౌలి , మాదాపూర్,జూబ్లీహీల్స్,బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో రాత్రివేళ పని చేసే యువతులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది.

ఈ యాప్ ను ఇప్పటి వరకూ 9 లక్షల 50 వేల మంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారు. ఐటీ కారిడార్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న యువతులు, మహిళలు ఈ యాప్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ యాప్ ను ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ ను 3 వేల 500 మంది వినియోగించారు. ఈ యాప్ కాకుండా..మహిళల భద్రత కోసం సిటీ పోలీసులు అనేక యాప్స తీసుకువచ్చారు. ట్విట్టక్, ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్ లో వచ్చే కంప్లైంట్స పోలీసులు పరిష్కరిస్తున్నారు.  ట్వీటర్, ఫెస్ బుక్ ,వాట్సాఫ్ గ్రూప్ లలో వచ్చే కంప్లేంట్ లను పోలీసులు పరిష్కారిస్తున్నారు.

మొబైల్ ఫోన్ లో ఈ యాప్ లేని మహిళలు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ధైర్యంగా ఉండేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు .