వ్యాక్సిన్​ సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం కోల్పోయినం

వ్యాక్సిన్​ సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం కోల్పోయినం
  • ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా కోసం ఆస్ట్రేలియాలో పదివేల అప్లికేషన్లు

సిడ్నీ: వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కరోనాకు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టామని రిలాక్స్ అవుతున్న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యామని, జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లలేక ఆదాయాన్ని కోల్పోయామని తమకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియా చెల్లించాలని కొంతమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ డిమాండ్ చేసే వాళ్లు ఎక్కువవుతుండడంతో కాంపన్సేషన్ కోసం అప్లై చేసుకోవడానికి వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెప్టెంబర్​లోనే స్టార్ట్ చేసింది. మెడికల్ ఖర్చులు, కోల్పోయిన ఆదాయం కలిపి 5 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాలని దరఖాస్తులో కోరుతున్నారు. ఇప్పటివరకు అప్లై చేసుకున్న వారికి కాంపన్సేషన్ చెల్లించాలంటే సుమారు 50 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కాగా, ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 36.8 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నామని 79 వేల రిపోర్టులు ఆస్ట్రేలియా థెరప్యూటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టీజీఏ)కు అందాయి. చెయ్యి నొప్పి, తలనొప్పి, జ్వరం, చలితో బాధపడినట్టు ఎక్కువ మంది తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 288 మంది గుండెల్లో మంట, ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న వారిలో 160 మంది త్రోంబోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే క్లాటింగ్ డిజార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధపడినట్టు టీజీఏకు రిపోర్టులు వచ్చాయి. టీకా తీసుకున్న 65 ఏండ్లుపైబడిన వారిలో 9 మంది మరణించారని టీజీఏ చెప్పింది. అయితే, కాంపన్సేషన్ కోసం అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలనే దానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ ఇవ్వలేదు.