
- కేంద్రానికి తెలిపిన రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో టీచర్ల ఖాళీల లెక్క తేలింది. రాష్ట్రంలో మొత్తం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిలో మొత్తం 1,38,517 సాంక్షన్ పోస్టులుంటే, వాటిలో 1,25,574 మందే పనిచేస్తున్నారు. 12,943 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 10,657 పోస్టులు, సెకండరీలో 2,286 పోస్టులున్నాయి. స్టూడెంట్, టీచర్ రేషియో ప్రకారం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 9,221 టీచర్ పోస్టులు ఎక్కువున్నట్లు ఎక్సెస్ఉన్నట్టు పీఏబీ నివేదికలో పేర్కొన్నారు. టీచర్ల రేషనలైజేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. ఎక్సెస్ పేరుతో ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయట్లేదనే ఆరోపణలున్నాయి. 85శాతం సెకండరీ స్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు టీచర్లున్నారు. ఎస్సీఈఆర్టీలో మొత్తం 45 పోస్టులకు 10 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 10 డైట్ కాలేజీల్లో 91శాతం వేకెన్సీలున్నాయి.