3.57 లక్షల మంది స్ట్రీట్‌ వెండర్లకు లోన్‌లు

3.57 లక్షల మంది స్ట్రీట్‌ వెండర్లకు లోన్‌లు
  • టార్గెట్‌కు మించి రుణాలిచ్చిన తెలంగాణ
  • కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 3,57,610 మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున లోన్లు అందించారు. రాష్ట్రంలో 3.40 లక్షల మంది స్ట్రీట్‌ వెండర్లకు లోన్‌లు ఇవ్వాలని టార్గెట్‌ పెట్టుకోగా లక్ష్యాని కన్నా 5.17% మందికి అదనంగా రుణాలిచ్చి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్రా గురువారం వీడియో కాన్ఫరెన్స్​లో ఈ విషయం చెప్పారు. సీఎస్ ​సోమేశ్​కుమార్​, అధికారులను అభినందించారు. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్రంలో 5,18,912 మంది స్ట్రీట్‌ వెండర్లు ఉన్నట్టుగా గుర్తించిందని సీఎస్‌ తెలిపారు. దీని కోసం ‘పట్టణ ప్రగతి - సర్వే ఆఫ్‌ స్ట్రీట్‌ వెండర్స్’ మొబైల్‌ అప్లికేషన్‌ తెచ్చామన్నారు.  రాష్ట్రంలో 3,19,765 మంది స్ట్రీట్‌ వెండర్లు డిజిటల్‌ పేమెంట్లు స్వీకరిస్తున్నారని, వారికి రూ.100 వరకు క్యాష్‌ బ్యాక్‌ వస్తుందని తెలిపారు. నెలకు 200 లకు పైగా రూ.25 అంతకన్నా ఎక్కువ విలువైన డిజిటల్‌ పేమెంట్లు తీసుకున్నోళ్లకు క్యాష్‌ బ్యాక్‌ రూ.35.03 లక్షలు వచ్చాయని తెలిపారు.