
కొంత మందికి పొద్దున్నే లేవగానే కప్పు కాఫీ తాగాల్సిందే... అయితే కాఫీ తాగడం మన శరీరానికి శక్తి వస్తుంది. కానీ ఉదయం పూట మాత్రమే కాఫీ తాగితే అది మన ఆరోగ్యానికి ఇంకా చాలా మేలు చేస్తుందని, ఎక్కువ కాలం జీవించడానికి కూడా సహాయపడుతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వచ్చిన ఒక పరిశోధన ప్రకారం అమెరికాలో 40 వేల మందిపై డాక్టర్లు క్వి అనే వ్యక్తి రీసర్చ్ చేశారు. ఈ పరిశోధనలో కాఫీ తాగే సమయం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గమనించారు.
రీసర్చ్ ఎం చెబుతుందంటే : కేవలం ఉదయం పూట మాత్రమే కాఫీ తాగే వారికి అసలు కాఫీ తాగని వారితో పోలిస్తే ఏ కారణంగానైన చనిపోయే ప్రమాదం 16 శాతం తక్కువగా ఉంటుంది. ఇంకా గుండె జబ్బుల వల్ల చనిపోయే ప్రమాదం 31 శాతం తక్కువగా కూడా. అయితే, రోజంతా కాఫీ తాగే వారికి ఈ ప్రయోజనాలు ఉండవు. అందుకే ఉదయం పూట మాత్రమే కాఫీ తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం కాఫీ తాగడానికి కారణాలు:
*ఉదయం కాఫీ తాగడం వల్ల మన శరీరం సరిగ్గా పనిచేస్తుంది. నిద్ర, జీర్ణక్రియ, హార్మోన్ల బ్యాలెన్స్ కాపాడుతుంది. సాయంత్రం లేదా రాత్రి పూట కాఫీ తాగితే వీటిని దెబ్బతినే అవకాశం ఉంది.
*ఈ రీసర్చ్ ప్రకారం ఉదయం మాత్రమే కాఫీ తాగే వారికి గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ. ఇది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది.
*మీరు సాయంత్రం 4 గంటల తర్వాత కాఫీ తాగినా కూడా దానిలో ఉన్న కెఫీన్ రాత్రి నిద్రపోయేటప్పుడు మీ శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల గాఢ నిద్ర దెబ్బతిని మీ శరీరం సరిగ్గా విశ్రాంతి తీసుకోలేదు.
*ఉదయం కాఫీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి పనిపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చు. కానీ మధ్యాహ్నం లేదా సాయంత్రం కాఫీ తాగితే ఆందోళనగా లేదా చికాకుగా అనిపించవచ్చు.
*ఉదయం మాత్రమే కాఫీ తాగడం వల్ల ఎక్కువగా తాగే అలవాటు తగ్గుతుంది. దీనితో పాటు అనవసరంగా స్నాక్స్ తినకుండా ఉండవచ్చు. మీరు కాఫీ ఎంత తాగుతారు, ఎప్పుడు తాగుతారు అనే దాని గురించి కూడా పరిశోధకులు పరిశీలిస్తున్నారు.