కలికాలం: నడిరోడ్డుపై బీర్ తాగుతూ.. ప్రశ్నిస్తే బూతులతో రెచ్చిపోయిన యువతి..

కలికాలం:  నడిరోడ్డుపై బీర్ తాగుతూ.. ప్రశ్నిస్తే బూతులతో రెచ్చిపోయిన యువతి..

కాలం మారుతోంది. వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో, ఆర్థిక స్వేచ్ఛ వల్ల వచచ్చిన బరితెగింపో తెలీదు కానీ, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అన్ని రంగాల్లో అబ్బాయిలకు ధీటుగా దూసుకుపోతున్న అమ్మాయిలు తాగుడు లాంటి అలవాట్లలో కూడా పోటీ పడుతున్నారు. పరిస్థితి చేస్తుంటే అనుకువగా, ఒద్దికగా ఉండే అమ్మాయిలు ఇక కనుమరుగవుతారేమో అన్న అనుమానం కలుగుతోంది.ఇవాళ ఉదయం హైదరాబాద్ లో జరిగిన సంఘటన చూస్తే మీకు కూడా ఇదే అనుమానం కలుగుతోంది.

ఉదయం అంతా వాకింగ్ చేసే సమయం, ఇంకా వైన్ షాపులు కూడా తెరవని సమయంలో ఓ జంట రోడ్ సైడ్ కార్ ఆపి, కార్లో పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేస్తూ బీర్ కొడుతూ, సిగరెట్ తాగుతూ చిల్ అవుతున్నారు. అటుగా వాకింగ్ చేస్తున్న వారు ప్రశ్నించారు. అంతే, ఆ యువతి వారిపై బూతులతో రెచ్చిపోయింది. వీడియో రికార్డ్ చేస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా ఒక చేతిలో బీర్ బాటిల్, మరొక చేతిలో సిగరెట్ పట్టుకొని ప్రశ్నించిన వాకర్స్ పై బూతులతో రెచ్చిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.