ఆరేళ్ల TRS పాలనలో బతుకులు మారలేదు

ఆరేళ్ల TRS పాలనలో బతుకులు మారలేదు

ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి . రంగారెడ్డి జిల్లా తుక్కుగూడాలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఓట్లకోసం వచ్చే అధికారపార్టీ నేతలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రశ్నించాలన్నారు.

రాష్ట్రం కాదు..కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబమైంది

ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదన్న ఆయన..కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానన్నారు. బంగారు తెలంగాణా అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయ్యింది. కేసీఆర్ సీఎం అయ్యారు. కేసీఆర్ కుమారుడు మంత్రి అయ్యారు. ఆయన కూతురు గతంలో ఎంపీగా పనిచేశారు.  అల్లుడు మంత్రి ఆయ్యారు. ఇంకో కుమారుడు ఎంపీ అయ్యారని కిషన్ రెడ్డి విమర్శించారు. TRS ప్రజల తీర్పు ను కాలరాస్తుందన్న కిషన్ రెడ్డి…తుక్కుగూడాలో అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు.

అధికార పార్టీ నేతల్ని డబుల్ బెడ్  రూం ఇళ్ల గురించి అడగండి

ఇక తుక్కుగుడాలో  TRS పార్టీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే …డబుల్ బెడ్ రూమ్ ఇళ్లగురించి నిలదీయండని ఓటర్లకు సూచించారు. పావలా వడ్డీ ఏమైందని ప్రశ్నించిన  ..కేంద్రం పొదుపు సంఘాలపై బడ్జెట్ కేటాయిస్తున్నా రాష్ట్రం మాత్రం పొదుపు సంఘాలకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.