కన్న తండ్రి క్రూరత్వం .. మంచంలో చిన్నారిపై పడుకోగా ఊపిరాడక మృతి

కన్న తండ్రి క్రూరత్వం .. మంచంలో చిన్నారిపై పడుకోగా ఊపిరాడక మృతి
  • నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఘటన

ఖానాపూర్, వెలుగు:  రోజుల చిన్నారిని కన్న తండ్రే కాటికి పంపిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్ఐ గైక్వాడ్ రాహుల్ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఖానాపూర్ టౌన్  సుభాష్ నగర్ కు చెందిన ఆలకుంట శేఖర్, సుజాత దంపతులకు 28 రోజుల కింద పాప పుట్టింది. మద్యానికి బానిసైన శేఖర్ ప్రతిరోజు భార్యతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం కూతురితో కలిసి సుజాత మంచంలో పడుకుంది. 

ఆ సమయంలో  శేఖర్ వచ్చి  మంచంలో చిన్నారిపై పడుకున్నాడు. దీంతో ఊపిరాడకపోవడంతో  బిడ్డ చనిపోయినట్టు  సుజాత విలపిస్తూ చెప్పింది. సుజాత, ఆమె తల్లి రాజమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.