కాలువలో పడి తల్లీ – కొడుకు మృతి

కాలువలో పడి తల్లీ – కొడుకు మృతి

కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లీ, కొడుకు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఖమ్మం జిల్లా.. ఏనుకూరు మండలం టిఎల్ పేట గ్రామ సమీపంలోని సాగర్ కాలువలో బట్టలు ఉతికేందుకు  తల్లి హుస్సేన్ బి (40) కొడుకు సాయిబాబు (10) వెళ్లారు. అయితే బట్టలు ఉతికే క్రమంలో కాలు జారి కాలువలో పడిపోయారాని స్థానికులు తెలిపారు. వీరిలో ఎవరు ముందుగా కాలువలో పడిపోయారో తెలువదని చెప్పారు.  కాలువలో నీళ్లు ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాల కోసం గాలించగా.. తల్లి హుస్సేన్ బి శవం మాత్రమే దొరికింది. సాయిబాబా మృతదేహం మాత్రం గల్లంతయింది.