దొంగల భరతం పట్టిన తల్లీకూతుళ్లు

దొంగల భరతం పట్టిన తల్లీకూతుళ్లు

సికింద్రాబాద్:ఇంట్లోకి తుపాకీతో ఆగంతకుడు చొరబడితే..ఎవరైనా ఏం చేస్తాం..భయంతో వణికిపోతాం..గట్టిగా అరుస్తాం.. ఇక్కడ తల్లీకూతుళ్లు ఆపని చేయ లేదు..దొంగల భరతం పట్టారు. ఈ ఘటన హైదరాబాద్ బేగంపేటలో జరిగింది. సాయంత్రం ఇద్దరు వ్యక్తులు బేగంపేటలోకి ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీ చూపించి తల్లీకూతుళ్లను బెదిరించారు. ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే దొంగలపై తిరగబడ్డ తల్లి.. జుట్టుపట్టుకొని ఈడ్చిపడేసింది. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. 

నిందితులు గతంలో ఆ ఇంట్లో పనిచేశారని.. ఇంటి గుట్టు తెలుసుకొని సంవత్సరం తర్వాత  దొంగతనానికి ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. నిందితులనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.