- వరంగల్ జిల్లా బుధరావుపేటలో ఘటన
- పిడుగుపడి చనిపోయి ఉంటారని గ్రామస్తుల అనుమానం
నర్సంపేట, వెలుగు : అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకు చనిపోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన తల్లీకొడుకు గిరగాని విజయ (45), విక్రమ్ (21) ఇద్దరూ శనివారం రాత్రి తమ ఇంట్లో చనిపోయి కనిపించారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుగ్గొండి సీఐ సాయిరమణ, ఎస్సై రఘుపతి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే బుధవారం మధ్యాహ్నం గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడిందని, ఈ టైంలో పిడుగు పడడం వల్లే తల్లీకొడుకులు చనిపోయి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.