
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కొడుకుల సూసైడ్ చేసుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. నవాబు పేట మండలం కొల్లూరు గ్రామంలో.. ఖాళీగా ఉంటున్న కొడుకును చదువుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన కొడుకు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుండు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన ఆ తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ గ్రామంలోని స్థానికులు అక్కడికి వెళ్లి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశారు. వారు అప్పటికే చనిపోయినట్లు అంబులెన్స్ సిబ్బంది చెప్పడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.