హైదరాబాద్లో జువెలరీ షాపు గోడకు కన్నం పెట్టి.. రూ.30 లక్షల వెండిని ఎత్తుకెళ్లిన దొంగలు

హైదరాబాద్లో జువెలరీ షాపు గోడకు కన్నం పెట్టి.. రూ.30 లక్షల వెండిని ఎత్తుకెళ్లిన దొంగలు

బంగారంతో పాటు వెండికి డిమాండ్ పెరుగుతుండటంతో దొంగల కన్ను సిల్వర్ పై పడినట్లుంది. హైదరాబాద్ లో దాదాపు 30 లక్షల రూపాయల విలువైన వెండిన దొంగిలించారు గుర్తుతెలియని వ్యక్తులు. మూసిన షాపు మేసినట్లే ఉంచి.. గోడకు కన్నం పెట్టి భారీ దోపిడీకి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. 2025 నవంబర్ 7వ తేదీ రాత్రి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ చోరీ. దుండిగల్ లోని సోమేశ్వర జ్యువెలర్స్ లో 18 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. మార్కెట్ రేట్ల ప్రకారం హైదరాబాదులో కిలో వెండి లక్షా 65 వేలుగా ఉంది. అంటే రూ.29 లక్షల 70 వేల రూపాయల విలువైన సిల్వర్ ను గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేశారు దుండగులు. 

వెండి అపహరణ కు గురైనట్లు బాధితులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. షాపు గోడకు కన్నం పెట్టి దుకాణంలోని వెండి సామాన్లను దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.