ఏ నిమిషానికి : గుండెపోటుతో కొడుకు.. ఆ వార్త విని తల్లి గుండె ఆగింది

ఏ నిమిషానికి : గుండెపోటుతో కొడుకు.. ఆ వార్త విని తల్లి గుండె ఆగింది

ఆ కుటుంబం కొన్ని నిమిషాల ముందు వరకు ఎంతో ఆనందంగా ఉంది.. ఎంతో ఆరోగ్యంగానూ ఉంది.. చీకూ చింతా లేని ఫ్యామిలీ.. ఫ్యామిలీగా ఉంది.. విధి రాతను ఎవరు తప్పించగలరు అన్నట్లు.. నిమిషాల్లో ఆ ఫ్యామిలీ మొత్తం చిన్నాభిన్నంగా అయ్యింది. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచనపల్లిలో.. జనవరి 6వ తేదీ జరిగిన ఘటన సంచలనంగా మారింది.. గ్రామంలో తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కూచనపల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ల వీరప్పగారి నర్సగౌడ్ జనవరి 6వ తేదీ శనివారం తెల్లవారుజామున గుండెనొప్పి అన్నారు. కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడని.. తీవ్ర గుండెపోటు వల్ల మరణించినట్లు వెల్లడించారు డాక్టర్లు. కుమారుడికి బాగోలేదని.. గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నాడని విషయం తెలిసిన 53 ఏళ్ల తల్లి లక్ష్మి.. కుమారుడిని చూడటానికి మెదక్ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి బోరున వేడుస్తూ.. కుప్పకూలిపోయింది. 

ఆస్పత్రిలోనే తల్లి లక్ష్మి కుప్పకూలటంతో... వెంటనే డాక్టర్లు వచ్చి పరీక్షలు చేశారు. అప్పటికే గుండెపోటుతో ఆమె చనిపోయిందని.. తీవ్ర కార్డియాక్ అరెస్ట్ వల్లే తల్లి లక్ష్మి చనిపోయింది డాక్టర్లు ప్రకటించారు. రెండు గంటల సమయంలోనే.. ఒకే ఇంట్లో కుమారుడు, తల్లి మరణించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జనం. నిన్నటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఎంతో ఆరోగ్యంగా తిరిగేవారని.. అలాంటి తల్లీ కుమారుడు.. ఇద్దరూ గంటల వ్యవధిలోనే గుండెపోటుతో చనిపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల్లో విషాధంలోకి వెళ్లారు.

గుండెపోటుతో చనిపోయిన నర్సగౌడ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.