
వ్యభిచారం చేయాలంటూ బలవంతపెట్టిన కన్నతల్లిపై చర్యలు తీసుకోవాలంటూ HRC లో ఫిర్యాదు చేసిందో అమ్మాయి. వేములవాడకు చెందిన సుజాత అనే మహిళ భర్త ఆరేళ్లక్రితం చనిపోయాడు. కొంతకాలానికి సుజాత వ్యభిచారం చేయడం స్టార్ట్ చేసింది. దీంతో పాటు తన ముగ్గురు కూతుర్లతో కూడా వ్యభిచారం చేయించేందుకు బలవంత పెట్టింది. మొదటి కూతురు, చివరి కూతురు తల్లి బలవంతానికి లొంగి వ్యభిచారం చేయగా.. రెండవ బిడ్డ మాత్రం తల్లిని వ్యతిరేకించి… హైదరాబాద్ లో నివసిస్తున్న తన బాబాయ్ దగ్గరకు వెళ్లి చదువుకోసాగింది. అయితే ఇందుకు సహించని సుజాత తన బిడ్డను కిడ్నాప్ చేశాడంటూ.. బాధితురాలి బాబాయ్ పై పోలీస్ కేసు పెట్టింది. దీంతో ఆయువతి లాయర్ సహాయంతో HRC ని ఆశ్రయించి తన తల్లిపై చర్యలు తీసుకోవలసిందిగా కోరింది.