ఈటలను ఎన్నికల నుంచి బహిష్కరించాలి

ఈటలను ఎన్నికల నుంచి బహిష్కరించాలి

దళిత బంధును అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. దళితులు బాగుపడితే బానిసలుగా ఉండరని భావిస్తున్నారని.. అఖిలపక్షం దళిత బంధును స్వాగతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక దళిత కుటుంబానికి 10లక్షలు ఇస్తానన్న కేసీఆర్ లాంటి మొనగాడు భారతదేశంలో లేడన్నారు. దళితుల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతా అంటే ఎందుకు అంత బాధ అని ప్రశ్నించారు. అంత డబ్బు..కాంగ్రెస్, బీజేపీ ఇస్తదా అని అన్నారు. దళితబంధు పథకంతో అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయన్న మోత్కుపల్లి.. దళిత బంధు వెతిరేకిస్తున్న వారి హృదయాలు మారాలని యాదాద్రి లక్ష్మీ నర్శింహా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తానని అన్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని దళితులకు పిలుపు ఇచ్చారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ అవినీతిపరుడని, పదవిని అడ్డం పెట్టుకుని 700 ఎకరాల భూమి సంపాదించారని ఆరోపించారు. 40 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమని ఆయనే చెప్పారని, ఆ భూమిని వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటలను ఎన్నికల నుంచి బహిష్కరించాలని చెప్పారు. ఉప ఎన్నికలో ఈటలను ఓడించాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు.