- పన్జేయని వాహన్, సారథి
- ఎర్రర్, సర్వర్ డౌన్‌తో వాహనదారులకు తిప్పలు
- సోమవారం లోపు సెట్ అవుతుందన్న ఆర్టీవో
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఆర్టీఏ కొత్తగా ప్రారంభించిన పోర్టల్స్‌లో సాంకేతిక సమస్యలు వాహనదారులను సతాయిస్తున్నాయి. ఆర్టీఏ ఆఫీసుల్లో సేవలన్నీ పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతోనే వాహన్ పోర్టల్‌తో పాటు ‘సారథి’ని తీసుకువచ్చారు. డ్రైవింగ్, పర్మినెంట్ లైసెన్స్‌కోసం సారథి, వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్స్రెన్యూవల్స్, ఫిట్నెస్సర్టిఫికెట్ల జారీ కోసం వాహన్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, టెక్నికల్ ఇష్యూస్‌తో పోర్టల్స్‌లో ఎర్రర్ అని, సర్వర్డౌన్అనివస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ఇన్ఫర్మేషన్కేంద్రం (ఎన్ఐసీ) ద్వారా ఆర్టీఏ ఈ సేవలను నిర్వహిస్తుండగా, కొద్ది రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇవీ సమస్యలు..
ఇంతకుముందు ఆర్టీఏ ఆఫీసుల్లోనే ఆన్లైన్సేవలతో పాటు క్యాష్పేమెంట్అందుబాటులో ఉండేది. కానీ సారథి, వాహన్ పోర్టల్స్వచ్చాక పూర్తిగా ఆన్లైన్ద్వారానే ట్రాన్సాక్షన్స్నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా లైసెన్స్రెన్యూవల్, ఫిట్నెస్సర్టిఫికెట్, యాజమాన్య మార్పిడి, వెహికల్ట్రాన్స్ఫర్కోసం రోజూ ఆన్లైన్లో వందల సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయి. అయితే, కొద్ది రోజులుగా అప్లై చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలకు కానీ, ఆర్టీఏ ఆఫీసులకు కానీ వెళ్తే సర్వర్లు డౌన్అని చూపిస్తోంది.
కొన్ని సైట్లు అసలే ఓపెన్‌కావడం లేదు. ఒకవేళ ఓపెన్అయి క్యాష్పేమెంట్చేస్తే మధ్యలోనే నిల్చిపోయి ఎర్రర్వస్తోంది. దీంతో ఆఫ్‌లైన్‌లో క్యాష్పేమెంట్చేద్దామని ఆఫీసులకు వెళ్లినా తీసుకోవడం లేదని తెలంగాణ ఆటో సంఘాల జేఏసీ నేత సత్తిరెడ్డి తెలిపారు. దీనిపై ఖైరతాబాద్‌ఆర్టీఓ ఆఫీసర్ పురుషోత్తం రెడ్డిని సంప్రదించగా టెక్నికల్ఇష్యూస్వల్ల ఇబ్బందులు వస్తున్నది నిజమేనని, మీ సేవా కేంద్రాల్లోనే ఈ సమస్య ఉన్నదన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర పరిధిలోని డేటాను ఈ పోర్టల్‌లోకి అనుసంధానం చేస్తున్నామని, అందుకే ఇలా జరుగుతోందన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, సోమవారం నాటికి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

