టెస్ట్ డ్రైవ్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్

టెస్ట్ డ్రైవ్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్

వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందవచ్చు. ఈ విధానం జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో వాహనదారులు RTO ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

కరోనా వెరస్ కారణంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారు  ఇకపై ఆర్‌టీవో ఆఫీస్‌ల ముందు లైన్‌లో గంటల కొద్ది నిలుచోవాల్సిన అవసరం లేదు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించి కొన్ని రూల్స్‌ను సవరించింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్ల నుంచి డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవింగ్ నేర్చుకున్న వారు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సిన పని లేదు.

అంతేకాదు.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్లలోనే ట్రాక్స్ ఉంటాయి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత వీటిల్లో వెహికల్ నడిపితే సరిపోతుంది. మళ్లీ ఆర్‌టీవో ఆఫీస్‌కు డ్రైవింగ్ టెస్ట్ కోసం వెళ్లాల్సిన పని లేదు.  ఐదు డ్రైవింగ్ స్కూళ్లకు మాత్రమే కేంద్రం గుర్తింపు ఉంటుంది. తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 4 వారాల్లో 29 గంటలు ఉంటుంది. మీడియం అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 6 వారాల్లో 38 గంటలు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది.