భారత్లో మోటో జీ 72 లాంచ్

భారత్లో మోటో జీ 72 లాంచ్

తన జీ -సిరీస్​లో కొత్త స్మార్ట్‌‌‌‌ఫోన్​ మోటో జీ 72ని సోమవారం మోటొరోలా భారతదేశంలో లాంచ్​ చేసింది. ఈ హ్యాండ్‌‌సెట్​లో మీడియాటెక్ జి 99ప్రాసెసర్​, 6 జీబీ ర్యామ్‌‌ ఉంటాయి.  120హెజ్​ రిఫ్రెష్ రేటు,  576హెజ్​ టచ్ శాంప్లింగ్​ రేటుతో 6.6-అంగుళాల పోల్డ్ డిస్​ప్లేను అమర్చారు. ఇది 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌‌తో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మోటో జి 72 ఆండ్రాయిడ్ 12 ఓఎస్​తో నడుస్తుంది. 30 వాట్ల టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్​గల 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 6జీబీ + 128జీబీ మోడల్ ధర18,999. ఈనెల 12 న మధ్యాహ్నం 12 గంటలకు  ఫ్లిప్‌‌కార్ట్​లో అమ్మకాలు మొదలవుతాయి. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే డిస్కౌంట్లు వస్తాయి.