7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రూ.7,499లకే మోటో G06 స్మార్ట్‌ఫోన్‌

7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రూ.7,499లకే మోటో G06 స్మార్ట్‌ఫోన్‌

మీ బడ్జెట్ లో స్మార్ట్​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా..?  ఫొటోగ్రఫీ కోసం అడ్వాన్స్డ్​ కెమెరా ఫీచర్లు కోరుకుంటున్నారా?.. పెద్ద డిస్ ప్లే,  ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ కావాలా.. ? అయితే మీకోసం వచ్చేసింది మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్‌..  

మోటరోలా భారతదేశంలో మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ సెట్​6.88-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, IP64 రేటింగ్‌తో వస్తోంది. మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రాసెసర్‌తో, 4GB RAM, 64GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 7000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ తో ఎక్కువ కాలం ఛార్జింగ్​ లైఫ్​ ఇస్తుంది. మోటో g06 POWER లో ఫోటోగ్రఫీ హైలైట్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరా సిస్టమ్ ఉంది. సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. 

మోటోరోలా అక్టోబర్‌ 7 న మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ను (Moto G06 Power Smartphone) లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులో ఉంది. 

మోటో G06 పవర్‌ స్పెసిఫికేషన్లు.. 

మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. 

ఆండ్రాయిడ్ 15 స్మార్ట్‌ఫోన్..

ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ G81 ఎక్స్‌ట్రిమ్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్‌ స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ, క్వాడ్ పిక్సల్‌ కెమెరా..

ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 7000mAh భారీ బ్యాటరీ కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి ఏకంగా మూడు రోజులపాటు ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు 50MP క్వాడ్‌ పిక్సల్ కెమెరా సిస్టమ్‌..ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

లభ్యత.. 

moto g06 POWER మూడు రంగుల్లో లభిస్తుంది. Tapestry, Laurel Oak, Tendril రంగుల్లో ఆకర్షణియంగా ఉంది.  ఇక 4GB  RAM,64GB స్టోరేజీతో లభిస్తుంది. Flipkart, Motorola.in ,భారతదేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అక్టోబర్ 11, 2025 నుంచి అమ్మకం ప్రారంభమవుతుంది.

ప్రారంభ ధర.. 

ఈ స్మార్ట్​ ఫోన్​ మీ బడ్జెట్​ ధరలో లభిస్తోంది. తక్కువ బడ్జెట్​ తో  ఆండ్రాయిడ్​, బెస్ట్​ కెమెరాతో ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీతో ఈ స్మార్ట్​ ఫోన్ వస్తుంది.   

ఈ ఫోన్ ప్రారంభ ధర:4GB + 64GB: రూ. 7,499

డిస్‌ప్లే: 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌తో
ప్రొటెక్షన్: Corning Gorilla Glass 3
డిజైన్: ప్రీమియం వేగాన్ లెదర్ డిజైన్, Pantone™ కలర్స్‌లో లభ్యం
ప్రాసెసర్: MediaTek Helio G81 Ultra
RAM/Storage: 4GB RAM + 64GB స్టోరేజ్ (మైక్రో SD సపోర్ట్‌తో)
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15
బ్యాటరీ: భారీ 7000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కెమెరా:
వెనుక వైపు – 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరా
ముందు వైపు – 8MP సెల్ఫీ కెమెరా
ఆడియో: డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో
సెక్యూరిటీ: సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
రేటింగ్: IP64 (డస్ట్, వాటర్ రెసిస్టెంట్)