అబోడ్ బయోటెక్​ ఇండియా ఓయూతో ఎంఓయూ

అబోడ్ బయోటెక్​ ఇండియా ఓయూతో ఎంఓయూ

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీతో అబోడ్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​ఆదివారం ఎంఓయూ కుదుర్చుకుంది. పరిశోధన, విద్యా కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. అధ్యాపకుల మార్పిడి, స్టూడెంట్​ఇంటర్న్ షిప్, శిక్షణ, మౌలిక సదుపాయాల వినియోగం, పరిశోధనా ప్రతిపాదనలు, ఇతర సహకార ప్రయత్నాలపై సహకరించుకుంటామని చెప్పారు. ఈ ఒప్పందం మూడు సంవత్సరాలు కొనసాగనుంది. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్​రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు  పాల్గొన్నారు.