వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆదికేశవ’. నవంబర్ 10న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే బుధవారం దర్శక నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. అలాగే ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు సినిమాల వసూళ్ళపై ప్రభావం పడటం గమనించాం. అందుకే చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించి నవంబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించాం’ అని చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది’ అని చెప్పాడు.
