
ప్రతీ వారంలాగే ఈ వారం(ఆగస్టు 18) కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ లిస్టులో థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీ(OTT)లో రిలీజయ్యే సినిమాలు కూడా ఉన్నాయి. గత వారం థియేటర్స్ లో రిలీజైన సినిమాల్లో రజనీకాంత్ జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారిస్తోంది. అయితే ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాల్లో పెద్ద సినిమాలేవీ లేవు కానీ.. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలున్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఈ వారం(ఆగస్టు 18) థియేటర్స్ లో విదులయ్యే సినిమాలు ఇవే. అందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా వస్తున్న మిస్టర్ ప్రెగ్నెంట్, జిలేబి, పిజ్జా 3,డీడీ రిటర్న్స్, బ్లూ బీటిల్, ద మమ్మీ, గూమర్ వంటి సినిమాలున్నాయి.
ఇక ఓటీటీలో ఈ వారం వచ్చే సినిమాల లిస్టు:
నెట్‌ఫ్లిక్స్: గన్స్ అండ్ గులాబ్స్, మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్), ద మంకీ కింగ్, ద అప్‌షాస్ పార్ట్ 4
హాట్‌స్టార్: మతగం
అమెజాన్ ప్రైమ్: హర్లాన్ కోబెన్స్ షెల్టర్ (వెబ్ సిరీస్), ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ (డాక్యుమెంట్ సిరీస్)
సోనిలివ్: ఆయిరతొన్ను నూనకల్ (మలయాళ)