టీఆర్ఎస్ నేత‌లు రైస్ మిల్ల‌ర్ల‌తో కుమ్మ‌క్క‌య్యారు

టీఆర్ఎస్ నేత‌లు రైస్ మిల్ల‌ర్ల‌తో కుమ్మ‌క్క‌య్యారు

నిజామాబాద్: లాక్ డౌన్ తో పేద ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశ్యంతో కేంద్రం 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు పంపిణీ చెస్తోందని తెలిపారు ఎంపీ అర‌వింద్. కంటేశ్వర్ ప్రాంతంలోని ఓ రేషన్ షాపులో రేషన్ తో పాటు.. కేంద్రం ఇస్తున్న కిలో కంది పప్పు పంపిణీని ప్రారంభించారు ఎంపీ అరవింద్. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఎంపీ..ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని..కడ్త పేరుతో 5కిలోల తరుగు తీయటం అన్యాయం అన్నారు.

కష్టపడి పంట పండించిన రైతు.. పంట అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని..కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం వాటిని సరిగా ఉపయోగించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు చెసి FCI గోదాంలకు పంపటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావటం లేదని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతుంటే మంత్రి ప్రశాంత్ మాత్రం కేసీఆర్ భజన చేస్తున్నాడన్నారు. ఐటి రంగానికి, పరిశ్రమలకు సాయం చేస్తామన్న మంత్రి కేటీఆర్ కి.. రైతు సమస్యలు కనపడటం లేదా? అన్నారు. మద్దతు దర కావాలని రాష్ట్రం ప్రపోజల్ పంపితే.. పసుపుకి మంచి మద్దతు ధర ఇచ్చేం దుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు ఎంపీ అర‌వింద్.