ఫసల్ బీమా ఉంటుంటే నిండు ప్రాణం పోయేది కాదు : ఎంపీ అర్వింద్

ఫసల్ బీమా ఉంటుంటే నిండు ప్రాణం పోయేది కాదు : ఎంపీ అర్వింద్

కామారెడ్డి జిల్లాలో రైతు బలవన్మరణంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఫసల్ బీమా ఉండుంటే రైతు నిండు ప్రాణం పోయేది కాదని ట్వీట్ చేశారు. ప్రీమియం ఎక్కువుందన్న కారణంతో సీఎం కేసీఆర్ బీమా కడతలేడని అర్వింద్ వాపోయారు. అవినీతి దందాలు చేసేందుకు పైసలుంటయి గానీ, రైతు కోసం ప్రీమియం కట్టేందుకు లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్తో ఆయన ఈ ట్వీట్ చేశారు. 

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోంగారానికి చెందిన పుట్ట ఆంజనేయులు నిన్న సెల్ టవర్ ఎక్కి ప్రాణాలు తీసుకున్నాడు. నీళ్లు పారుతుండటంతో పదేళ్లుగా చెరువు కింద ఉన్న భూమిలో పంట సాగు చేయడంలేదు. విషయం ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఆంజనేయులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నమ్మకం లేకపోవడంతో సెల్ టవర్పైనే టవల్తో ఉరివేసుకున్నాడు.