రేవంత్​ మొండిఘటం..పట్టుదలతో సీఎం అయ్యిండు: ఒవైసీ

రేవంత్​ మొండిఘటం..పట్టుదలతో సీఎం అయ్యిండు: ఒవైసీ
  •     రాష్ట్ర అభివృద్ధిలో అండగా ఉంటం : ఎంపీ అసదుద్దీన్​

సీఎం రేవంత్ రెడ్డి మొండిఘటమని, పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని, రేవంత్ రెడ్డి ఐదేండ్లు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని, రాష్ట్ర అభివృద్ధిలో సీఎం రేవంత్ కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. శుక్రవారం పాతబస్తీలో ఎంజీబీఎస్ టు -ఫలక్​నుమా మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని.. కానీ, కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాలని సీఎంను ఆయన కోరారు. సీఎంను కలవగానే పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేశారని

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఒవైసీ తెలిపారు. అలాగే, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త బిల్డింగ్ నిర్మించాలని, చంచల్ గూడ జైలును ఓల్డ్ సిటీ నుంచి తరలించాలని, ఆ ప్లేస్ కేజీ టూ పీజీ వరకు విద్యా సంస్థలు నెలకోల్పాలని ఒవైసీ కోరారు. సీఎం రేవంత్​ డ్రీమ్​ ప్రాజెక్ట్​ అయిన మూసీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు.