ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఒక నెల జీతం విరాళం: ఒవైసీ

ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఒక నెల జీతం విరాళం: ఒవైసీ

ఎంఐఎం (మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని పాతబస్తీలో ఆదివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గోన్న ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ముందుగా పార్టీ ఆఫీస్ ఆవరణలో ఉన్న జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దఎత్తున విధ్వంసం జరిగినా ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు నోరు విప్పట్లేదని అసద్ ప్రశ్నించారు. ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.

ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఎంఐఎం నేతలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు అసదుద్దీన్‌ ఒవైసీ. తెలంగాణలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయొద్దని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

mp-asaduddin-owaisi-comments-at-mim-party-62nd-anniversary-celebration