లాక్ డౌన్ రాజ్యాంగ విరుద్ధం: తబ్లిగి సభ్యులపై అసదుద్దీన్ ప్రశంసల వర్షం

లాక్ డౌన్ రాజ్యాంగ విరుద్ధం: తబ్లిగి సభ్యులపై అసదుద్దీన్ ప్రశంసల వర్షం

తబ్లిగి జమాత్ సభ్యులపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. తబ్లీగి జమాత్ కు చెందిన 38 మంది ప్లాస్మా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వీరిలో 25 మంది తెలంగాణకు చెందిన వారని చెప్పారు. కరోనా పై విజయవంతంగా పోరాడారని అన్న ఆయన.. కొంతమంది తబ్లీగి జమాత్ సభ్యులను సూపర్ స్ప్రెడర్ , కరోనా జిహాద్ అంటూ ఆరోపించారని అసహనం వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ విషయంలో అసదుద్దీన్ కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. వలస కార్మికులు ఇళ్లకు వెళ్ళిన తర్వాత లాక్ డౌన్ ఎత్తేయటం సరైన వ్యూహమేనా..? లాక్ డౌన్ అమలుకు 4 గంటలు, ఎత్తేయటానికి వారం రోజులా..? అని విమర్శించారు.

మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశం ఆర్థికంగా కుప్ప కూలుతోందని.. లాక్ డౌన్ న్యాయ పరంగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందా లేదా అన్న అంశంపై కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాలన్న అసదుద్దీన్..చైనా ఆక్రమిస్తున్నా బీజేపీ వర్గాలు నోరు విప్పే సాహసం చేయడం లేదని తప్పుబట్టారు.