
హైదరాబాద్ : మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై వారితో చర్చించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానానికి మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఎంఐఎం ఎమ్మెల్సీ హసన్ జాఫ్రీ పదవీకాలం మే1తో ముగియనుంది. హసన్ జాఫ్రీ ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్నారు.