ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. శనివారం ( జూన్ 6 ) విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తాడని.. అణుడిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కే పాల్పడ్డాడని అన్నారు కిరణ్ కుమార్.
తన ఫోన్ మాత్రమే కాదని... హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. ట్యాపింగ్ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసని... కేసీఆర్ సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారని అన్నారు. ఇవాళ సిట్ తనను బాదితుడిగా సిట్ విచారణకు పిలిచిందని అన్నారు కిరణ్ కుమార్. తాను మీడియా కమిటీ చైర్మెన్ గా ఉన్నప్పుడు ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించారు. కేసీఆర్ కు సొంత మంత్రుల మీద కూడా నమ్మకం లేదని అన్నారు.
2023 జులై 30న తన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించిందని.. అసెంబ్లీ ఎన్నికల వరకు తన ఫోన్ ట్యాప్ అయ్యిందని అన్నారు కిరణ్ కుమార్. నిజాం పాలనలో రజకారులు కూడా అంత వేధించలేదని అన్నారు. గతంలో తన ఐఫోన్ కి అలర్ట్ వచ్చిందని...ఎన్నికల ప్రచారంలో పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడే విషయాలన్నీ తెలుసుకునేవారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లేవారిని ముందుగానే గుర్తించి బెదిరింపులకి పాల్పడ్డారని అన్నారు కిరణ్ కుమార్.
ALSO READ : E85 పెట్రోల్ ఎందుకు రా బాబు..
తన ఫోన్ మాత్రమే కాదని.. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాప్ చేసిన నిందితులకు శిక్ష పడుతుందని భవిస్తున్నానని అన్నారు కిరణ్ కుమార్.
