
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో “భారతదేశంలో పట్టణ ప్రాంతాలను నిర్వచించే జనగణన ప్రమాణాల పునఃసమీక్ష” అంశంపై చర్చించారు. దీనికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శులు హాజరయ్యారు.
దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న పట్టణీకరణ, దేశవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక, ఆర్థిక మార్పులను పూర్తిగా ప్రతిబింబించలేకపోతున్నదనే అంశం కమిటీలో చర్చించారు. జనగణన ప్రమాణాల పునఃసమీక్ష కేవలం గణాంకపరమైన అవసరం మాత్రమే కాకుండా, ఆధునిక వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని, పాలనాపరమైన ఆవశ్యకత అని కమిటీ సభ్యులు చర్చించారు.
బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు..
న్యూఢిల్లీ, వెలుగు: డెడికేషన్ కమిషన్ పెట్టి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేశామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీసీ బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బీసీ నేతగా చెప్పుకునే బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యపై గురుతర బాధ్యత ఉందని, ఢిల్లీలోనూ బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని సూచించారు.