గ్రూప్- 1 ఉద్యోగాలు రావొద్దని కుట్ర : ఎంపీ చామల

గ్రూప్- 1 ఉద్యోగాలు  రావొద్దని కుట్ర : ఎంపీ చామల
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంపీ చామల ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఉద్యోగాలు రాకూడదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రూప్1 పరీక్షల్లో 563 మంది అభ్యర్థుల దగ్గర రూ.3 కోట్ల చొప్పున తీసుకొని ప్రభుత్వం వారిని ఎంపిక చేసిందని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకులు రావొద్దన్న సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని, గ్రూప్ 1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తల్లిదండ్రులు వీడియో సందేశాలతో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.