బండి సంజయ్ హోదాను మరిచి మాట్లాడుతున్నరు : ఎంపీ చామల

బండి సంజయ్ హోదాను మరిచి  మాట్లాడుతున్నరు : ఎంపీ చామల
  • మతాల గురించి కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడు: ఎంపీ చామల 

హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాను మర్చిపోయి మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హిందువులంతా ఏ పార్టీలో ఉన్నా.. బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైందన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు ఒక కులం, ఒక మతం వాళ్లు ఓట్లేస్తే గెలవలేదని, అన్ని వర్గాల వారు ఓట్లేస్తేనే గెలిచారన్నారు. 

రాష్ట్రానికి నిధుల కోసం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ కులాలు, మతాల ప్రస్తావన పక్కనబెట్టి, అభివృద్ధి గురించి మాట్లాడాలని సూచించారు.