- ఎంపీ చామల డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్ లో చర్చ జరపాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రాల సెక్యూరిటీ ఆఫ్ ఎకానమీపై చర్చ జరగాలన్నారు.
సోమవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులతో ఆస్తి, పంట నష్టం జరిగినా ఇప్పటి వరకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉండేందుకు నితీశ్ కుమార్, చంద్రబాబు మద్దతు అవసరం కాబట్టి బిహార్, ఏపీలకు కేంద్రం నిధులు, ప్రాజెక్టులు ఇస్తోందని విమర్శించారు.
