
- తెలంగాణతో పాటు భారత్ కూడా దీనిపై దృష్టి పెట్టాలి: ఎంపీ చామల
- న్యూయార్క్‌లో జరుగుతున్న పర్యావరణ సదస్సుకు హాజరు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, భూతాపం వంటి సమస్యలు వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రపంచ దేశాలే కాకుండా భారత్ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ‘పర్యావరణం.. సుస్థిరత’అనే అంశంపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ స్థాయి సదస్సులో గురువారం భారత్ పార్లమెంటేరియన్స్ తరఫున చామల పాల్గొని, మాట్లాడారు.
ప్రపంచ పర్యావరణంలో వస్తున్న మార్పులపై తెలంగాణ సమాజం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు, పెట్రోల్‌తో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని, వీటి స్థానంలో పునరుత్పాదక ఇంధనం వాడాలని కోరారు. వేగంగా పెరుగుతున్న వాహన కాలుష్యం కూడా వాతావరణ మార్పులకు మరో కారణమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వినియోగిస్తే జీరో కాలుష్యం విడుదలవుతుందని చెప్పారు.