హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడితే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతోందని.. ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీపై చిల్లరగా మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల మేరకు వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పొలీస్ స్టేషన్లో ఎంపీ చామల ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులపై కవిత చేసిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు.
►ALSO READ | గద్వాలలో అభివృద్ధి జాడే లేదు: బండల వెంకట్ రాములు
బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సంపదను దోచుకొని.. కేవలం రెండు సంవత్సరాల పాలన చేసిన కాంగ్రెస్ పార్టీపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకుల దోపిడీ భరించలేకనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని ఓడించారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదని ఎద్దేవా చేశారు.
