గద్వాలలో అభివృద్ధి జాడే లేదు: బండల వెంకట్ రాములు

గద్వాలలో అభివృద్ధి జాడే లేదు: బండల వెంకట్ రాములు

గద్వాల టౌన్, వెలుగు : 12 ఏండ్ల నుంచి అధికారంలో ఉన్నా గద్వాలలో అభివృద్ధి జాడేలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్ రాములు ధ్వజమెత్తారు. ఆదివారం బంగ్లాలో వారు మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా గద్వాలను అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. రోడ్ల నిర్మాణం కోసం రూ.316 కోట్లు అంటూ ఉదరగొడుతున్న వ్యక్తి.. ఏ పార్టీకి చెందినవాడో తెలియని పరిస్థితి ఉందన్నారు. 

గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏండ్లు, ఇప్పుడు కాంగ్రెస్ లో 2 ఏండ్ల నుంచి కొనసాగుతున్నారని విమర్శించారు. డీకే అరుణ చేసిన అభివృద్ధి, గద్వాల ఎమ్మెల్యే అరాచకంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, శ్యామ్, రజక జయశ్రీ, కిష్టన్న, దాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు