
సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జగిత్యాలలో తమ మాట వినని 385 మంది సర్పంచులను ప్రభుత్వం అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుందో సీఎం కేసీఆర్ కు కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడంసరైంది కాదన్నారు .దీనివల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మున్సిపల్ బిల్లును గవర్నర్ తిప్పి పంపడం.. ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు.ఇకనైనా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాస్వామ్య విలువలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు అరవింద్.