
- నిజామాబాద్ ఎంపీ అర్వింద్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేసి, బీఆర్ ఎస్ అంటూ దేశ పర్యటనలు చేస్తున్నడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, కేంద్ర స్కీంల ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నదని ఎంపీ శనివారం ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు.పేద ప్రజలను దోచుకుంటున్న వారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు.
సభలో పసుపు రైతుల గురించి ప్రధాని ప్రస్తావించినందుకు అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు. పసుపునకు కేంద్రం మద్దతు ధర పెంచాలని, ఇందుకు ప్రపోజల్స్ పంపాలని కేంద్రం అడుగుతుంటే రాష్ర్ట ప్రభుత్వం పంపడం లేదని ఆయన మండిపడ్డారు. ఈఫసల్ బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.